దాదా అభిమానుల ఆగ్రహం: దెబ్బతిన్న రైళ్ల రాకపోకలు
|
|
|
| ఆస్ట్రేలియాలో జరిగే ముక్కోణపు వన్డే టోర్నమెంట్‌కు బీసీసీఐ ప్రకటించిన జట్టులో బెంగాల్ టైగర్ సౌరవ్ గంగూలీకి చోటు దక్కకపోవడంపై దాదా అభిమానులు సోమవారం రైలు పట్టాలెక్కారు. దీంతో తూర్పు రైల్వేలోని రెండు సెక్షన్‌ల్లో రైళ్ల రాకపోకలు దెబ్బతిన్నాయి.
టీం ఇండియాలో దాదాకు చోటు దక్కకపోవడాన్ని నిరసిస్తూ 24 పరగణాల ఉత్తర ప్రాంతంలో ఉన్న బరసాత్ వద్ద అతని అభిమానులు బ్లాకేడ్ నిర్వహించారు. సోమవారం ఉదయం 10.05 గంటల సమయంలో టీం ఇండియాలో గంగూలీకి చోటు కల్పించాలని డిమాండ్ చేస్తూ అభిమానులు రైళ్ల రాకపోకలను అడ్డుకున్నారని తూర్పు రైల్వే ప్రతినిధులు తెలిపారు. దాదాను జట్టులోకి తీసుకోవాలని, దాదాను పక్కన పెట్టడాన్ని కుట్రగా ఆరోపిస్తూ వారు నినాదాలు చేశారు. దీంతో బససాత్- బోంగాన్, బససాత్- హస్నాబాద్ సెక్షన్‌ల్లో రైళ్ల రాకపోకలు దెబ్బతిన్నాయి. భారత సెలెక్టర్లు ఆదివారం సీనియర్లు రాహుల్ ద్రావిడ్, వీవీఎస్ లక్ష్మణ్‌లతో పాటు సౌరవ్ గంగూలీని పక్కనబెట్టి ఆస్ట్రేలియా- భారత్- శ్రీలంక జట్లు పాల్గొనే ముక్కోణపు వన్డే సిరీస్ టీమును ప్రకటించిన సంగతి తెలిసిందే. |


